CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు. అంతకుముందు ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.

గత ఏడాది నాగర్‌కర్నూల్‌ జిల్లా నార్లాపూర్‌లో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 6.4 టీఎంసీల సామర్థ్యం గల అంజనగిరి రిజర్వాయర్‌లోకి కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసే వెట్‌ రన్‌ను ప్రారంభించేందుకు మెగా పంప్‌హౌస్‌ను బటన్‌ నొక్కి స్విచ్‌ ఆన్‌ చేశారు.

నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో 10.00 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించి ఈ పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారు.

Also Read: Kishan Reddy : షర్మిలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి