CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి

ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది.

CM Revanth Reddy: ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అటు ఏపీలో కూడా ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కాగా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు..

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధులు, ప్రాజెక్టులు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు భూపతిరాజు శ్రీనివాస్ వర్మలకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అలాగే హామీల అమలుకు కృషి చేయాలని కోరుతున్నాను అని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రపప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరియు కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు మరియు ప్రాజెక్టులపై లోకసభలో గళం విప్పాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: Pemmasani Chandrashekar: పెమ్మసాని మామూలోడు కాదు… బ్యాగ్రౌండ్ ఇదే…!