తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభా (KCR Wife Shobha)..ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని (Tirumala) దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకు ముందు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు.
We’re now on WhatsApp. Click to Join.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు. కాగా శ్రీవారి దర్శనం కోసం సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆమెతోపాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ రావడం.. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిసింది. కేసీఆర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని తిరుమలేశుడిని కోరుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్కోరోజు దాదాపు 68వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also : BRS Manifesto : 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. వరాల జల్లుకు రంగం సిద్ధం