BRS Manifesto : కాసేపట్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో.. రైతులు, మహిళలపై వరాల జల్లు!

BRS Manifesto :  ఇంకాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముందో తెలిసిపోనుంది.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr

Cm Kcr

BRS Manifesto :  ఇంకాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముందో తెలిసిపోనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు, అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల  సమక్షంలో మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతున్నారు. అందులోని ముఖ్యమైన హామీలు, అంశాలను సీఎం కేసీఆర్ స్వయంగా వివరించనున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు అందరికీ బీఫామ్స్ ను పంపిణీ చేస్తారు. దీంతోపాటు తెలంగాణ భవన్ లోనే పార్టీ అభ్యర్థులు, ఇంచార్జి లతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు.  ఆ వెంటనే ప్రగతి భవన్ కు వెళ్తారు. సాయంత్రం 4.50 కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో  ఎన్నికల ప్రచార శంఖారావం సభ కోసం హుస్నాబాద్ కు కేసీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు.

ఈసారి మేనిఫెస్టోలో కొత్త పథకాలు

ఈసారి మేనిఫెస్టోలో కొన్ని కొత్త పథకాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా రైతుల కోసం ఉచిత ఎరువుల పంపిణీ పథకం  ఉందని చెబుతున్నారు. రూ.1 లక్ష దాకా వ్యవసాయ రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రూ.1000 మేర ఆసరా పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి నిధుల పెంపు, షాదీ ముబారక్ నిధుల పెంపు, మహిళలకు ఆర్థిక చేయూత, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థినులకు సైకిళ్లు వంటివి  బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.  మహిళలు, మధ్య తరగతి ప్రజలు, యువత, రైతులను టార్గెట్ గా చేసుకొని కారు పార్టీ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

గత అసెంబ్లీ పోల్స్ లో పోలింగ్‌ కు సరిగ్గా  5 రోజుల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ  మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ అయింది. గ్రౌండ్ లెవల్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. దీంతో  ఈసారి అన్నీ ముందుగానే చేసేస్తున్నారు. చాలా ముందుగానే కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక మేనిఫెస్టోను కూడా చాలా చాలా ముందుగా ఇవాళే విడుదల చేయబోతున్నారు. దీన్నిబట్టి మారిన రాజకీయ పరిణామాల ఒత్తిడి బీఆర్ఎస్ పై ఎంతగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. కాంగ్రెస్‌ గ్యారంటీల కంటే గొప్పగా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీష్‌రావు అంటున్నారు. అదెలా ఉంటుందో మరికాసేపట్లో (BRS Manifesto) తెలిసిపోతుంది.

Also Read: Yoga – Israel Schools : యుద్ధం వేళ ఇజ్రాయెల్ లో యోగా ఉద్యమం

  Last Updated: 15 Oct 2023, 09:45 AM IST