CM KCR : అందరి అభిష్టం మేరకు త్వరలోనే జాతీయ పార్టీ…!!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీపై క్లారిటీ వచ్చింది. అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తానని సీఎంవో నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 09:50 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీపై క్లారిటీ వచ్చింది. అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తానని సీఎంవో నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. కొత్త పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరి కోరికమేరకు తాను జాతీయ పార్టీని స్థాపిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఈ పార్టీని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. పలు రంగాలకు చెందిన మేధావులు, ఆర్థికవేత్తలు, నిపుణులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఎజెండా ఖరారు చేసామని…జాతీయ పార్టీ విధివిధానాలు రూపొందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

Also Read : సీఎం కేసీఆర్ కు కుమారస్వామి సంపూర్ణ మద్దతు

ఆదివారం ప్రగతి భవన్ లో కర్నాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల గురించి వీరిద్దరూ చర్చించారు. ఆ సందర్భంలోనే జాతీయ రాజకీయాల్లోకి వచ్చి…తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా ముందుండి నడిపించాలన్న ఒత్తిడి తనపై రోజురోజూకు పెరిగిపోతోందని కుమారస్వామికి కేసీఆర్ వివరించారు. మతోన్మాద బీజేపీ, మోదీ ప్రజావ్యతిరేక, నిరంకుశ పాలనపై పోరాడాలని జిల్లాల పర్యటనలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారని కేసీఆర్ చెప్పారు.

Also Read : షర్మిల పాదయాత్రను జనం పట్టించుకోవడం లేదా..తెలంగాణలో పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పెడితే మంచిదా..?

బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్న కుమారస్వామి…జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. బీజేపీకి ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ లేదని…ఆ పార్టీ నాయకత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ప్రాంతీయ పార్టీల ఏకీకరణ ఎంతవరకు సాధ్యం అవుతుంది. జాతీయ పార్టీతో కేసీఆర్ విజయం సాధిస్తారా…ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే జాతీయ పార్టీ స్ధాపనపై సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు.