Site icon HashtagU Telugu

KCR Visit To AP: సీఎం కేసీఆర్ ‘ఛలో విజయవాడ’

CM kcr and telangana

CM KCR Telangana

మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చిన తెలంగాణ సీఎం, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మరోసారి విజయవాడ రానున్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ కేంద్రంగా జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభ లలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభకు కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు హాజరు కానున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అటు సీపీఐ, ఇటు సీపీఐ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ కోరిక మేరకు మునుగోడు అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్టు సీపీఐ నేతలు స్పష్టం చేశారు. మోడీపై పోరు కోసం సీపీఎం పార్టీ కేసీఆర్ కు పరోక్ష మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం సీపీఐ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ విజయవాడలో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై గురి పెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటించడం ఆసక్తి రేపుతోంది.