KCR Bihar Tour: రేపు బీహార్ లో కేసీఆర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కార్యాచరణ రూపొందిస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 30, 2022 / 11:49 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎక్కడ సభ పెట్టినా మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే రైతు సంఘాలతో జతకట్టిన కేసీఆర్, మరోసారి జాతీయ రాజకీయాలపై గురి పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నెల 31న బీహార్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి సీఎం పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా, గాల్వన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. సైనిక కుటుంబాలతో పాటు… రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయనున్నారు.

అమరులైన సైనికుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు. మృతి చెందిన వలస కూలీ కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 లక్షల చెక్కును అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.