Site icon HashtagU Telugu

KCR National Party: తగ్గేదేలే.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్!

Brs, Delhi tour

Brs

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) త్వరలో హైదరాబాద్‌లో తన జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి సెప్టెంబర్ 11న హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాతే ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని సమాచారం.

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారందరినీ ఒక దారిలోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పయనిస్తూ పలువురు నేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా ఆయన బీహార్‌లో నితీష్‌ కుమార్‌ను కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు మాత్రమే ఉంది. ఆయనకు జాతీయ రాజకీయాలపై మంచి పట్టుంది. మోడీని నిలువరించే ఇతర నేతలు  ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో కేసీఆర్ సై అంటూ కేంద్రంపై యుద్ధం చేస్తుండటం గమనార్హం.