Site icon HashtagU Telugu

TS Debts: తెలంగాణకు వచ్చే అప్పు లెక్క తేలిపోయింది.. మరి ఆ రూ.80 వేల కోట్ల సంగతేంటి?

Kcr

Kcr

తెలంగాణకు వచ్చే అప్పు అంత ఇంత అని అనుకోవడమే కాని.. నిజానికి ఎంత వస్తుందో ఇన్నాళ్లూ క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో ఆ లెక్క కొలిక్కి వచ్చేసింది. అది రూ.23 వేల కోట్లే అని స్పష్టత వచ్చింది. ఒక వేళ ఈ లెక్కే నిజమైతే.. ఈసారి బడ్జెట్ లో కచ్చితంగా సమస్యలు తప్పవు. ఎందుకంటే 2022-23 ఏడాదికి గాను.. తెలంగాణ సర్కార్.. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో అప్పుల లెక్కలను కూడా ప్రస్తావించింది.

బడ్జెట్ లో చెప్పినదాని ప్రకారం చూస్తే.. రూ.53,970 కోట్లను అప్పుగా తీసుకుంటామని తెలంగాణ సర్కార్ చెప్పింది. కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పుల గురించీ తెలిపింది. ఆ వివరాలు చూస్తే.. ట్రాన్స్ కో, జెన్కో, డిస్కమ్ లకు రూ.12,198.70 కోట్లు, దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏర్పా్టు చేసిన కార్పొరేషన్లకు రూ.22,675.07 కోట్లను అప్పుగా తీసుకుంటామని చెప్పింది. అంటే ఈ రెండు మొత్తాలను కలిపితే.. అది రూ.34,873.77 కోట్లు అవుతుంది.

బడ్జెట్ లో చెప్పిన అప్పులు, కార్పొరేషన్ గ్యారంటీ అప్పులను కలిపితే.. అవి.. రూ.88,843 కోట్లు అవుతాయి. వీటితోపాటు మిషన్ కాకతీయ, భగీరథకు సుమారు రూ.40 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. అంటే ఇవన్నీ కలిపి రూ.1.28 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ అనేక లెక్కల తరువాత నికరంగా వచ్చేది రూ.23 వేల కోట్లే అని తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇస్తోంది. గ్రాంట్ల కింద వచ్చే అప్పు కూడా రూ.10 వేల కోట్లకు మించి రాకపోవచ్చని భావిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు అంటున్నారు.