TS Assembly: రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌రిపాల‌న‌పై అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ రెచ్చిపోయారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఆరోపించారు.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 05:28 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌రిపాల‌న‌పై అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ రెచ్చిపోయారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. అంతేకాదు, 12ల‌క్ష‌ల కోట్లు సుమారుగా కార్పొరేట్ కంపెనీల‌కు రైటాఫ్ చేసిన కేంద్ర స‌ర్కార్ రైతుల‌కు అన్యాయం చేస్తోంద‌ని ఆవేద‌న చెందారు. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని దుర్మార్గంగా ముందుకు మోడీ స‌ర్కార్ వెళుతోంద‌ని దుయ్య‌బట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాక‌పోవడాన్ని ప్రస్తావిస్తూ లెక్క‌ల్ని బ‌య‌ట‌పెట్టారు. నిరంత‌రం విద్యుత్ ను ఇస్తోన్న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టాల‌ని విద్యుత్ బ‌కాయిల విష‌యంలో త‌ప్పుడు లెక్క‌లు చెబుతోంద‌ని అన్నారు. రాష్ట్రానికే ఏపీ నుంచి సుమారు. 17వేల కోట్లు రావాల‌ని ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

Also Read:   CM KCR : అందరి అభిష్టం మేరకు త్వరలోనే జాతీయ పార్టీ…!!!

అసెంబ్లీ వేదిక‌గా బ‌య‌ట‌పెట్టిన ఆధారాలు త‌ప్పని నిరూపిస్తే ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌త్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని చెప్పారు. అందుకోసం కొత్త పార్టీ ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లీడ‌ర్ గా, బంగారు తెలంగాణ‌కు మోడ‌ల్ ను చూపిస్తూ దేశాన్ని ముందుకు న‌డిపిస్తాన‌ని అన్నారు. చేత‌గానీ మోడీ ప్ర‌భుత్వం కార‌ణంగా పేద‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందారు. మొత్తం మీద న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ ప్ర‌సంగం ఆక‌ట్టుకుంది. ఆయ‌న స్పీచ్ లోని ప్రతి అంశానికి ఆధారాల‌ను చూపుతూ, వాటిని అబ‌ద్దాల‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ చేయ‌డం అసెంబ్లీలో ఒక్క‌సారిగా సీరియ‌స్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Also Read:    AP Politics: ఏపీపై `పీకే-కేసీఆర్` ఆప‌రేష‌న్

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మార‌డంతో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కర్కశంగా ఏపీలో కలిపేశారని విమర్శించారు. అసెంబ్లీకి ప్రతిపాదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏపీకే ఇచ్చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఒక ఫాసిస్టు అని ప‌దేప‌దే అంటానని స్పష్టం చేశారు. మొత్తం మీద జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, మోడీల‌ను అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ త‌న స్పీచ్ తో ఆడుకున్నారు.