Telangana Budget: నేడు తెలంగాణ బడ్జెట్.. వాటిపై ఎక్కువ కేటాయింపులు..?

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అదేవిధంగా సొంత స్ధలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థికసాయాన్ని చేరుస్తారని సమాచారం.

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 07:55 AM IST

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అదేవిధంగా సొంత స్ధలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థికసాయాన్ని చేరుస్తారని సమాచారం. ఉ.10.30కు అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి దాన్ని మరింత పెంచినట్లు తెలుస్తోంది.

ఈ బడ్జెట్‌లో సంక్షేమం, సాగునీటి పారుదల, పేదరిక నిర్మూలన, అభివృద్ధి అంశాలపై ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలిసింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. అలాగే దళితబంధు, రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు సమాచారం.

Also Read: CM KCR: రైతులు చ‌ట్టాలు రాయాలి.. నాందేడ్‌ బీఆర్ఎస్ స‌భ‌లో సీఎం కేసీఆర్

అంతకముందు.. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2023-24 రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించి ఆమోదించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఆదివారం మధ్యాహ్నం నాందేడ్ లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభ తర్వాత పార్టీకి ఇది రెండో బహిరంగ సభ కాగా, తెలంగాణ వెలుపల తొలి బహిరంగ సభ. ఈ సమావేశంలో నాందేడ్, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు BRSలో చేరారు.