CM Revanth Delhi Tour: తెలంగాణకు సహకరించండి: మోడితో రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై

Published By: HashtagU Telugu Desk
CM Revanth Delhi Tour

CM Revanth Delhi Tour

CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాజకీయ పరంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి విషయంలో పలు సమస్యలను విన్నవించారు. ఈ మేరకు తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాలు, కేంద్ర ఆరోగ్య మిషన్ పథకాల కింద కేంద్రం ఇంకా నిధులు విడుదల చేయలేదు.

భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేను ఈ రోజు మొదటిసారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరాం. ఈ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Kashmiri Kheema: నోరూరించే కాశ్మీరీ ఖీమా.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?

  Last Updated: 26 Dec 2023, 07:12 PM IST