CM Revanth Reddy Warning: విపక్షాల తీరుపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. చట్టాన్ని ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీ(DGP)తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ పార్టీని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ జితేందర్ శుక్రవారం నగరంలోని మూడు కమిషనర్లతో సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నగరంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జీరో టాలరెన్స్ విధానం ప్రవేశపెడతామని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు.
ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. వారి ఇళ్లను ముట్టడించే కార్యక్రమం చేపడుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడికి పాల్పడిన అరెకపూడి గాంధీ, అతని మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, ఇతర బిఆర్‌ఎస్ నాయకులు గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాగ్వాదం సందర్భంగా కౌశిక్ రెడ్డి అడిషనల్ డీసీపీని తోసి తన అంతు చూస్తానని బెదిరించాడని ఆరోపించారు.
Also Read: Money Make Sick: డబ్బు లెక్కింపులో ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి.. లేకుంటే ఆరోగ్య సమస్యలే..!