తెలంగాణ CID చీఫ్ గోవింద్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. సోమవారం నాడు రాజస్థాన్ లో ఈఘటన జరిగింది. ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ తోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు. రాంఘర్ లోని మాతేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే సింగ్ భార్య షిలా సింగ్ మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు రాజస్థాన్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లారు. సింగ్ సహా ఇతరుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. సింగ్ భార్య మరణించడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన గోవింద్ సింగ్ సీఐడీ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఏసీబీ డీజీగా 2021 సెప్టెంబర్ లో ఆయన్ను తెలంగాణ సర్కార్ నియమించింది.