Site icon HashtagU Telugu

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆందులో భాగంగా సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్‌ కార్డులు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు వడ్డీ లేని రుణ పథకం తదితర అంశాలకు కేబినెట్ ఆమెదం తెలిపింది.

తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

* 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు కేటాయించారు. ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇళ్ళు చొప్పున లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక చేస్తారు.
* కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
* ముదిరాజ్ కార్పొరేషన్
* యాదవ కురుమ కార్పొరేషన్
* మున్నూరుకాపు కార్పొరేషన్
* పద్మశాలి కార్పొరేషన్
* పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
* లింగాయత్ కార్పొరేషన్
* మేరా కార్పొరేషన్
* గంగపుత్ర కార్పొరేషన్
* ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
* ఆర్య వైశ్య కార్పొరేషన్
* రెడ్డి కార్పొరేషన్
* మాదిగ, మాల ఉప కులాల కార్పొరేషన్
* కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
* సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
* ఏకలవ్య కార్పోరేషన్
* మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)
* అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు
* ఆరోగ్య శ్రీ రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు
* ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది
* 92 శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతుభరోస పూర్తవుతుంది.
* గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
*స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఓ.ఆర్.ఆర్ పరిధిలో 25 ఎకరాల స్థలంలో వసతి ఏర్పాటు.
*వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పధకం ఏరాటు.
*2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ (టైం స్కెల్ ) ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం
*వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన క్యాబినెట్
*గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ.
*విధ్యుత్ రంగంలో అవకతవకలపై జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి అధ్యక్షతన కమీటీ.
*100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్

Exit mobile version