Site icon HashtagU Telugu

Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ

Telangana cabinet meeting on January 4

Telangana cabinet meeting on January 4

Telangana Cabinet: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు( Many important decisions)తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు, వర్షాకాలం నుంచి పంటల బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మహిళలకు నెలకు 2500 రూపాయలపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 5 లక్షల రూపాయల జీవిత బీమా, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయాలు తీసుకోనున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా శక్తి సభలో వీటిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లు మరోమారు గవర్నర్ చెంతకుగవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్‌ పేర్లను మరోమారు గవర్నర్ ఆమోదం కోసం పంపడంతోపాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

read also :Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం