ఈనెల 23న జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet Meeting) భేటీ 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (State Chief Secretary Shantikumari) వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో హైడ్రాయ మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ సమావేశం చేయనున్నట్లు తెలిసింది.
అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరుగుతుందని CS శాంతికుమారి పేర్కొన్నారు. అయితే, కేబినెట్ మీటింగ్ వాయిదాపడడానికి కారణాలు తెలియరాలేదు.
Read Also : EECP Treatment : బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ లేకుండా గుండెకు చికిత్స చేయడం సాధ్యమేనా?