Site icon HashtagU Telugu

Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

తెలంగాణలో మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) వాయిదా పడింది. తొలుత ఈనెల 29న జరగాల్సిన సమావేశాన్ని ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తూ 30న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం ఒక గంటకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అదే రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. దీంతో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యం మరింత పెరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఆ ప్రక్రియను ఏ విధంగా అమలు చేయాలి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Ganesh Chaturthi 2025: ఇంట్లో గణపయ్య విగ్రహం పెడుతున్నారా.? అయితే మీరు ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే !!

అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏర్పడిన కమిషన్ నివేదికను కూడా ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించనున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు, సూచనలు, సవరణలు వంటి విషయాలపై చర్చ జరగనుంది. దీంతో రాబోయే ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాల దిశలో ఈ క్యాబినెట్ భేటీ కీలక మలుపుగా భావిస్తున్నారు.