ఈనెల 11 న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం (Telangana Cabinet) జరగబోతుంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరుకానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా షెడ్యూలు సిద్ధం చేసారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను లాంఛనంగా భద్రాచలంలో ఈ నెల 11న ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3,000 మేర రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలోని నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపైనే కేబినెట్ చర్చించి ఆమోదం పొందనున్నది.
We’re now on WhatsApp. Click to Join.
వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్‌లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదం పొందడంతో పాటు ఆన్-గోయింగ్ స్కీములుగా ఉంచేందుకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 12 నుంచి మహిళలకు వడ్డీలేని రుణాల పథకం ప్రారభించబోతుంది సర్కార్. దీనిపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణలో ని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తుంది. కానీ గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
Read Also : Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి కొత్త ఫొటోలను రిలీజ్: ఎన్‌ఐఏ