Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.

Published By: HashtagU Telugu Desk
Telangana cabinet meeting on January 4

Telangana cabinet meeting on January 4

Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో 4న సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్‌ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ, రైతు భరోసా విధివిధానాల ఖరారు, రాష్ట్రంలో భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.

ఇటీవల ప్రభుత్వం సంక్రాంతి నుంచే రైతుభరోసా పథకం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతఖర్చవుతుంది.. కొత్త రేషన్‌ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూ భారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టుగా సమాచారం. దీంతో ఈ కేబినెట్ భేటీ పై ఆయా వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఇక, ఈ నెల 30న కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాప దినాల్లో భాగంగా నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.

Read Also: Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ

 

  Last Updated: 31 Dec 2024, 04:47 PM IST