Site icon HashtagU Telugu

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే.. అన్నీ సంచలనాలే..

Telangana Cabinet Meeting Decisions Full Details

Telangana Cabinet Meeting Decisions Full Details

తాజాగా నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) జరిగింది. సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని తెలిపారు.

తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..

తెలంగాణ ఆర్టీసీ..

ప్రజా రవాణాని పటిష్టం చేసేందుకు ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

మెట్రో విస్తీరణ ..

ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రోకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా పనులు మొదలయ్యాయి.

మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోని పొడిగించడం.

LB నగర్ వరకు ఉన్న మెట్రోని హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ వరకు పొడిగించడం.

ఉప్పల్ వరకు ఉన్న మెట్రోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వరకు పొడిగించడం.

ఉప్పల్ నుంచి ECIL క్రాస్ రోడ్ వరకు మెట్రో

ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయడం.

ఎయిర్ పోర్ట్ నుంచి ORR మీదుగా కందుకూరు వరకు మెట్రో.. ఇవన్నీ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటామని తెలిపారు KTR.

అలాగే జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ తీర్మానించింది.

ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా కూడా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

వరద సాయం..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులకు , వివిధ వర్గాలకు, రోడ్లకు భారీ నష్టం జరిగింది. దీనికోసం తక్షణ సహాయం కింద రూ.500కోట్లు నిధులు విడుదల, యుద్ధ ప్రాతికదికన తాత్కాలిక మరమ్మతులు.

సన్మానాలు..

వరదల్లో ప్రజలని కాపాడి, సహాయంగా నిలిచిన పలువురికి ఆగస్టు 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం.

రైతుల కోసం..

వర్షాలతో చెరువులు, కాలువల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు.

ఇటీవల మరణించిన పలు రైతులకు ఎక్స్‌గ్రేషియా…

రోడ్లు, వంతెనలు..

వరదలతో తెగిన రోడ్లు, కల్వర్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు.

అనాధల కోసం..

రాష్ట్రాల్లోని అనాధ పిల్లలని చిల్డ్రన్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా గుర్తించి వారికి కావల్సిన సౌకర్యాలని ప్రభుత్వమే అమలు చేసి వారికి తల్లి తండ్రి ప్రభుత్వమే అవుతుందని కేబినెట్ ఆమోదించింది. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని కేబినెట్ నిర్ణయాలు..

మహబూబ్ నగర్‌లో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు

హైదరాబాద్‌లో టిమ్స్ హాస్పిటల్‌లో ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు ఆమోదం.

నిజాం హాస్పిటల్‌లో మరో రెండువేల పడకల భవనం

బీడీ టేకేదారులకు పెన్షన్

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు భూ సేకరణ చేసి కేంద్రప్రభుత్వానికి ఇవ్వడం

హకీమ్ పేట్ ఎయిర్‌పోర్ట్ ని పౌర విమానయాన సేవలకు కూడా వినియోగించాలని కేంద్రం, రక్షణ, పౌర విమానయానశాఖకు అభ్యర్థన

కాపు కమ్యూనిటీ భవనంకు హైదరాబాద్‌లో స్థలం కేటాయింపు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం