Site icon HashtagU Telugu

Telangana Cabinet Expansion: తెలంగాణ కొత్త మంత్రులు వీరే.. నేడే ప్ర‌మాణ స్వీకారం!

Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో (Telangana Cabinet Expansion) గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు ఎమ్మెల్యే), వాకిటి శ్రీహరి (మక్తల్ ఎమ్మెల్యే), అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి ఎమ్మెల్యే) కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జ‌ర‌గ‌నున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు వివ‌రించాయి. వివేక్ మాల సామాజిక వర్గం నుంచి, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ వర్గం నుంచి, వాకిటి శ్రీహరి బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విస్తరణ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

గడ్డం వివేక్ వెంకటస్వామి

Also Read: Maganti Gopinath: ఎవ‌రీ మాగంటి గోపినాథ్‌.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం ఇదే!

వాకిటి శ్రీహరి

అడ్లూరి లక్ష్మణ్