Site icon HashtagU Telugu

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం .. కానీ షరతులు వర్తిస్తాయి

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. కాగా ఈ రోజు ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఈసీ కొన్ని షరతులతో కేబినెట్ సమావేశానికి అనుమతించింది.

ఈసీ విధించిన షరతుల ప్రకారం జూన్ 4 వరకు వాయిదా వేయలేని సమస్యలపై దృష్టి సారించి, తక్షణ అమలు అవసరమయ్యే అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని పేర్కొంది. దీని ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మరియు పంట రుణాల మాఫీకి సంబంధించిన ఎజెండా అంశాలు లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయబడతాయి. అదనంగా ఈసీ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారిని సమావేశాలకు హాజరు కావడానికి వీల్లేదు.

Also Read: Telugu States : విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే