తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget 2024) 3వ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote On Account Budget) ను ప్రవేశ పెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు.
శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు :
- రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
- పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774కోట్లు
- పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
- వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
- బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21389కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైద్య రంగానికి రూ.11500 కోట్లు
- గృహజ్యోతికి రూ.2418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందని భట్టి చెప్పుకొచ్చారు. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది.
అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్‌లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు.
Read Also : Telangana Budget 2024 : అందరి కోసం మనమందరం అంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి