హైదరాబాద్ (Hyderabad) లో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 11న జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ (E-Racing) ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 నుంచి హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Budget) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) కూడా విధించారు. ఈ రేస్ కారణంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, మింట్ కాంపౌండ్ నుండి ఐ మాక్స్ వరకు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇక NH-163లో అంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనుల కోసం పోలీసులు ట్రాఫిక్ (Traffic Restrictions) ను మళ్లించారు.
రేసింగ్ పోటీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో రోడ్ల పాక్షిక మూసివేత అమల్లోకి వస్తుందని, ఫిబ్రవరి 11 వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఫార్ములా ఇ రేస్ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి మంగళవారం చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆమె సూచించారు. ఫార్ములా ఇ రేసు కారణంగా సచివాలయ పనుల్లో జాప్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేయాల్సి ఉంది.
బడ్జెట్ సమావేశాలకు ఆంక్షలు
హైదరాబాద్‌లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆంక్షల ప్రకారం, తెలుగుతల్లి – ఇక్బాల్ మినార్ – రవీంద్ర భారతి మార్గాల్లో ట్రాఫిక్‌ను (Traffic Restrictions) అవసరాన్ని బట్టి నిలిపివేయవచ్చు లేదా మళ్లించవచ్చు. దీంతో ‘‘వివి విగ్రహం – షాదన్ – నిరంకారి – పాత పిఎస్ సైఫాబాద్ – రవీంద్ర భారతి; మాసబ్ ట్యాంక్ – PTI భవనం – అయోధ్య – నిరంకారి; కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ – బషీర్‌బాగ్ జంక్షన్ నుండి పాత పిసిఆర్ జంక్షన్ వరకు; BJR విగ్రహం – AR పెట్రోల్ పంప్ – పాత PCR జంక్షన్; M J మార్కెట్ – తాజ్ ఐలాండ్ – నాంపల్లి రైల్వే స్టేషన్ – AR పెట్రోల్ పంప్ – పాత PCR జంక్షన్; BRK భవన్ – ఆదర్శ్ నగర్ – పాత PCR జంక్షన్; మంత్రుల నివాస సముదాయం, రోడ్ నెం. 12, బంజారాహిల్స్ – విరించి హాస్పిటల్స్’’ మార్గాల్లో ట్రాపిక్ ఆంక్షలు లేదా మార్పులు చేయొచ్చు.
Also Read: Singareni Record: బొగ్గు రవాణాలో ‘సింగరేణి’ ఆల్ టైమ్ రికార్ట్!