Telangana Budget 2025 : ఈ ఆర్థిక సంవత్సరం చివరి (2026 మార్చి) నాటికి తెలంగాణకు ఉండే అప్పులు, వచ్చే ఆదాయాలపై అంచనాలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 2026 మార్చి నాటికి తెలంగాణకు దాదాపు రూ.5,04,814 కోట్ల అప్పులు ఉంటాయని భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా ఉందన్నారు.ఈ బడ్జెట్లో అప్పులను రూ.69,639 కోట్లుగా ప్రతిపాదించారు. తెలంగాణలో గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ మార్గంలో పెడుతున్నామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. సంక్షేమంతో పాటుగా తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Also Read :Nagpur Violence : నాగ్‌పూర్ అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం.. ఎఫ్ఐఆర్లో కీలక వివరాలు
2026 మార్చి నాటికి ఆదాయం ఇలా..
- తెలంగాణ(Telangana Budget 2025) రాష్ట్రానికి సొంత పన్నుల ద్వారా రూ.1,45,419 కోట్ల రాబడి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అంచనా వేశారు.
- కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,899 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లలో రూపంలో రూ.22,782 కోట్లు వస్తాయన్నారు.
- రాష్ట్రానికి పన్నేతర ఆదాయం రూ.31,618 కోట్లు ఉంటుందన్నారు.
- రాష్ట్రానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి రూ.19,087 కోట్ల ఆదాయం, ఎక్సైజ్ శాఖ నుంచి రూ.27,623 కోట్ల ఆదాయం, అమ్మకం పన్నుతో రూ.37,463 కోట్ల ఆదాయం, వాహనాలపై వేసే పన్నుతో రూ.8,535 కోట్ల ఆదాయం సమకూరుందని భట్టి వెల్లడించారు.
- ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36, 504 కోట్లుగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Also Read :Kennedy Assassination: జాన్ ఎఫ్ కెనడీ హత్య.. సీక్రెట్ డాక్యుమెంట్లు విడుదల.. సంచలన వివరాలు
చైనా ప్లస్ వన్ వ్యూహం గురించి భట్టి ఏమన్నారంటే..
- మెగా మాస్టర్ ప్లాన్ 2050ను రూపొందించాం.
- రాబోయే పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం.
- చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మారుస్తాం.
- రాష్ట్రంలోని ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేయిస్తాం.
- ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం.
- అదే బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం.
- మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తాం.