Site icon HashtagU Telugu

Telangana Omicron: బీ రెడీ ఫర్ థర్డ్ వేవ్!

Harish Rao

Harish Rao

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక హరీష్ రావు స్పీడ్ పెంచారు. ప్రభుత్వ ఆసుపత్రులు పర్యటించడం అక్కడి సమస్యలు తీర్చడం అధికారులు కూడా సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇక తెలంగాణాలో ఓమిక్రాన్ కేసులు వచ్చినా ప్రజలు ఇబ్బందిపడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని,
545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలని అధికారులను హరీష్ ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆయన ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు.
మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని,
కొత్త వేరియంట్ రూపంలో మూడో వేవ్ ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి 27, 996 పడకలకు గానూ 25, 826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తి అయ్యిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లలో మందుల నిల్వలను నిర్వహించాలని హరీష్ సూచించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రభుత్వాలకు తోడుగా ప్రజలు వారి బాధ్యతలు నిర్వర్తించ వలసి ఉంటుందని మంత్రి తెలిపారు.

Exit mobile version