Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.

  • Written By:
  • Updated On - December 28, 2023 / 08:43 AM IST

Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమీక్షించడానికి ఇతర చర్చలతో పాటు తెలంగాణ బిజెపి యూనిట్ గురువారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కొంగర కలాన్ శ్లోకా కన్వెన్షన్ సెంటర్ లో బిజేపి రాష్ట్ర స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వివిధ స్థాయిల్లోని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తాలూకా స్థాయి నాయకులు, వివిధ పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సన్నాహకాలపై చర్చలతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఔట్రీచ్ ప్రోగ్రామ్ వికసిత్ భారత్, రామమందిర శంకుస్థాపనతో సహా పలు అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎంపీలు ప్రకాశ్‌ జవదేకర్‌, కె. లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్‌ కుమార్‌, సునీల్‌ బన్సాల్‌, రాష్ట్ర ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌లు ఈ సమావేశంలో ముఖ్యఅతిధులుగా పాల్గొనన్నునారు.

Also Read: Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!

రాష్ట్ర స్థాయి సమావేశం తరువాత నవంబర్ 30 ఎన్నికల్లో గెలిచిన బిజెపి శాసనసభ్యులతో కూడా షా సమావేశం కానున్నారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.