బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చేసిన విషయం తెలిసిందే. బండి స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. అయితే బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి. ఎలాగంటే అధ్యక్షుడి ఉన్నపుడు బండి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శించేవారు. ప్రతి విషయంలోను కేసీయార్ లేదా ఆయన కుటుంబాన్ని పిక్చర్లోకి లాగి రాచి రంపాన పెట్టేవారు.
మర్యాద, హుందాతనం అన్నది బండి మాటల్లో పెద్దగా వినబడేదికాదు. పక్కా మస్ మసాలా మాటలు, డైలాగులు ఉపయోగించేవారు. చాలాసార్లు బండి మాటలు అన్నీ హద్దులను దాటేసేవారు. దాంతో బండి ఉపయోగించిన భాషపై చాలా రాద్దాంతమే జరిగింది. ఇక కిషన్ విషయం చూస్తే బండిలాగ మాస్ మసాలా భాషను ఉపయోగించలేరు. ప్రత్యర్ధులపై కౌంటర్లు గట్టిగానే వేస్తారు, ధాటిగా పాయింట్ బై పాయిట్ మాట్లాడుతారు. అయితే ఒకస్ధాయికి దిగిపోయి కిషన్ మాట్లాడలేరు.
ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇక్కడే బండికి, కిషన్ కి మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. అందుకనే కేసీయార్, ఆయన కుటుంబంపై కిషన్ మాట్లాడే మాటలు, విసిరే పంచులు పెద్దగా ప్రభావం చూపవనే ప్రచారం మొదలైపోయింది. ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో కిషన్ వేసే పంచులు గట్టిగా ఉండకపోతే ప్రత్యర్ధులపై ఎలాంటి ప్రభావం కూడా చూపవు. బండి సంజయ్ ను తప్పించడంతో బీజేపీకే పెద్ద లాస్ అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మధ్య మంచి ర్యాపో ఉందంటూ ఇప్పటికే టీ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తు్నారు. ఇక ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని నిరూపించేందుకు మాస్టర్ స్కెచ్ వేసింది. తాజా పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోగా, కాంగ్రెస్ ఊహించనివిధంగా పుంజుకుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా రంగంలో దిగబోతోంది.
Also Read: Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలకు బ్రేక్!