Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారబోతున్నారా?

తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మారబోతున్నారా?. త్వరలోనే కొత్త నాయకుడు బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారా?. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణాలో బీజేపీ వ్యూహం మారబోతుందా?

Kishan Reddy: తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు (Telangana BJP Chief) మారబోతున్నారా?. త్వరలోనే కొత్త నాయకుడు బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారా?. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణాలో బీజేపీ వ్యూహం మారబోతుందా? గత కొంత కాలంగా ఈ ప్రశ్నలు బీజేపీ నేతలకు ఎదురవుతున్న ప్రశ్నలు. తెలంగాణాలో బీజేపీ బలపడాలంటే పార్టీ అధ్యక్ష పదవిలో మార్పు రావాలని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్ని కిషన్ రెడ్డి (Kishan Reddy) కొట్టిపారేశారు. బేస్ లెస్ వార్తలంటూ ఆయన ఖండించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చే ఆలోచన లేదని, అసలు అలాంటి అవసరమే లేదన్నారు కిషన్ రెడ్డి. మేమంతా ఒక తల్లి బిడ్డల్లా ఉంటున్నామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనపై ఆయన మాట్లాడారు. కవిత అరెస్ట్ అంశం మా పరిధిలోది కాదని, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం సీబీఐ చూస్తుందని, కవిత అరెస్ట్ అంశం కూడా సిబిఐ చేతుల్లోనే ఉంటుందని అన్నారు.

కర్ణాటక ఫలితాలపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక (Karnataka Results) ఫలితాలు తెలంగాణాలో రిపీట్ అవ్వబోదని ఆయన అన్నారు తెలంగాణాలో కాంగ్రెస్ కి అంత సీన్ లేదని, బీఆర్ఎస్ పార్టీకి పోటీనిచ్చేది బీజేపేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం(AIMIM) ‌పార్టీ నడిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిస్తే తెగ సంబరపడిపోతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. కాగా తాజాగా ఆర్బీఐ ఇటీవల పెద్ద నోట్లను (200 Notes) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉందని , రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారన్నారంటూ ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.

Read More: New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ