టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు…తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఛాన్స్ దొరికితే చాలు…విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. ఇదంతా టీఆర్ఎస్, కేసీఆర్ ఆడిన డ్రామా అంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేశారు. ఈ వ్యవహారంపై తాను యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తాం. మీకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేస్తారా అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ మేరకు సంజయ్ మర్రిగూడ క్యాంప్ కార్యాలయం నుంచి యాదాద్రికి బయల్దేరారు.
ఎవరు అడ్డుకున్నా యాదాద్రికి వెళ్లి తీరుతా అంటూ బండి సంజయ్ పట్టుదలతో ఉన్నారు. ప్రమాణం చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామన్నారు. అయితే యాదాద్రిలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ ఆయన దిష్టి బొమ్మను దగ్దం చేశారు. బండి పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే యోచనలో ఉన్నట్లు సమచారం. యాదాద్రికి బండి సంజయ్ వెళ్తారా లేదా మధ్యలోనే పోలీసులు అడ్డుకుంటారా చూడాలి.