Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 09:29 PM IST

ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల అంటూ అడిగారు. తాను భైంసాకు ఎందుకు రావద్దో చెప్పాలంటూ ప్రశ్నించారు.

కాగా నిర్మల్ లోని ఆడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఆదివారం చెప్పినట్లుగానే పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పోచమ్మ తల్లి సాక్షిగా తన పాదయాత్రను ప్రారంభిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. భైంసాను సున్నితమైన ప్రాంతంగా ఎవరు మార్చారో తెలిపాలంటూ డిమాండ్ చేశారు. పనిరాని సాకులతో తన పాదయాత్రను అడ్డుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలను తాను పాటిస్తానని చెప్పారు.