Site icon HashtagU Telugu

Telangana BJP MP Candidate List : తెలంగాణ బిజెపి లోక్ సభ అభ్యర్థులు వీరే..

Telangana Bjp Mp Candidate List

Telangana Bjp Mp Candidate List

లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా​ గాంధీనగర్​ నుంచి పోటీ చేయబోతున్నారు.

రాష్ట్రాలవారీగా చూస్తే బెంగాల్ – 27, మధ్యప్రదేశ్‌- 24, గుజరాత్‌- 15, రాజస్థాన్‌- 15, కేరళ- 12, తెలంగాణ- 9, ఝార్ఖండ్‌- 11, ఛత్తీస్‌గఢ్​- 12, దిల్లీ- 5, జమ్మూకశ్మీర్‌- 2, ఉత్తరాఖండ్‌- 3, అరుణాచల్‌ ప్రదేశ్‌- 2, గోవా- 1, త్రిపుర- 1, అండమాన్‌ నికోబార్‌- 1, దమన్‌ అండ్‌ దీవ్‌- 1 అభ్యర్థులను పోటీలో నిలిపింది. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్‌ తావ్డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు బరిలో ఉండగా, 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ లో 9 మందిని ప్రకటించింది బిజెపి. మల్కాజిగిరి నుంచి చాలా మంది పోటీ పడగా… చివరకు ఈటల రాజేందర్ కు మొగ్గు చూపించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి. కిషన్ రెడ్డి , నిజామాబాద్ నుంచి అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించారు. బీబీ పాటిల్‌కు బీజేపీలో చేరిన తదుపరి రోజే టికెట్ దక్కడం విశేషం. తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత సోయం బాపూరావు ఉన్నారు. ఎల్లుండి ఆదిలాబాద్ కు నరేంద్ర మోదీ వస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎంపీ సీటుపై అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. అలాగే మహబూబ్‌నగర్ స్థానాన్ని సైతం పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ డీకే.అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉండడం తో ఈ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది. అలాగే మహబూబాబాద్, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, వరంగల్ పెండింగ్ లో పెట్టింది. ఇక ఏపీ లో ఒక్క సీటు కూడా ప్రకటించలేదు.

Read Also : Pawan Kalyan : పవన్ పూర్తిగా కాపు ఓటర్లపైనే ఆధారపడతాడా..?