Telangana BJP Manifesto 2023 : బిఆర్ఎస్ ‘దళిత బంధు’ కు పోటీగా బిజెపి ‘దళిత్ రత్నా’ ..?

బిఆర్ఎస్ ఎలాగైతే దళిత బంధు తో రాష్ట్ర దళితులను ఆకట్టుకుందో..బిజెపి సైతం అదే తరహాలో పధకాన్ని తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
BRS

Bjp's Strength Is The Gain For Brs.. How Is It..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి (BJP) తన దూకుడు ను మరింత పెంచాలని చూస్తుంది. ఇప్పటీకే అధికార పార్టీ బిఆర్ఎస్ మేనిఫెస్టో (BRS Manifesto 2023) తో ప్రజల్లోకి వెళ్తుండగా..కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ (Congress announces six Guarantees) హామీలతో ఆకట్టుకుంటుంది. మరి బిజెపి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది..? ఎలాంటి హామీలు ఇవ్వబోతోందనే ఆత్రుత రాష్ట్ర ప్రజల్లోనే కాదు నేతల్లోనూ నెలకొంది. ఈ క్రమంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ లకు ఏమాత్రం తీసిపోని రీతిలో బిజెపి మేనిఫెస్టో ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

బిఆర్ఎస్ ఎలాగైతే దళిత బంధు (BRS Dalitha Bandhu) తో రాష్ట్ర దళితులను ఆకట్టుకుందో..బిజెపి సైతం అదే తరహాలో పధకాన్ని తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది. బిజెపి తమ మేనిఫెస్టో (BJP manifesto 2023)లో ‘దళిత్ రత్నా’ (Dalith Ratna )అనే పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. ఉద్యోగాలు ఇచ్చే వాళ్లను తయారుచేయడంపై ఎక్కువగా రాష్ట్ర బీజేపీ దృష్టిసారించిందని సమాచారం. ఇక దళిత రత్న పథకం కింద.. దళితులు అలాగే ఇతర వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహాకాలను ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దళిత రత్న ఫథకం అనేది దళితులు సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా రూ.10 లక్షలు ఇచ్చేలా ఉండదు. ఈ పథకం కింద పలు సబ్సిడీలు, ఇంకా ఇతరాత్ర ప్రోత్సహకాలు ఉండనున్నట్లు సమాచారం. దళితులు ప్రయోజనం పొందేలా ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని.. తాము మేనిఫెస్టోలో ప్రకటించే అన్ని పథకాలు అమలు చేస్తామని బిజెపి కి చెందిన కీలక నేత చెప్పినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె రేపు హైరాబాద్ లో బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించబోతుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీనగర్ స్టేడియంలో (LB Stadium) జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం పార్టీ ఒక ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మోదీ రాకతో తమ నేతల్లో ఉత్సాహం వస్తుందని…అలాగే తమ ఎజెండాను కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు బీజేపీ నేతలు.

Read Also : CM KCR : సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. తప్పిన ప్రమాదం

  Last Updated: 06 Nov 2023, 01:46 PM IST