Telangana BJP : వెనుకంజలో బీజేపీ హేమాహేమీలు

Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎదురుగాలి వీస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Etela Rajendra fires on KCR Government Regarding Houses

Etela Rajendra fires on KCR Government Regarding Houses

Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎదురుగాలి వీస్తోంది. గజ్వేల్,  హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల కూడా ఓట్ల లెక్కింపులో ఆయన వెనుకంజలో ఉన్నారు.  గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో సీఎం కేసీఆర్ రెండో రౌండ్ ముగిసే సరికి స్వల్ప మెజార్టీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుండటంతో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటలకు ఆధిక్యం దక్కే ఛాన్స్ లేకుండాపోయింది. మరోవైపు హుజురాబాద్‌లోనూ ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ అభ్యర్ధి  కౌశిక్ రెడ్డి లీడ్‌లో కొనసాగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానంలో కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్‌లో ఉన్నారు. మరోవైపు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా వెనుకబడిపోయారు. దుబ్బాకలో రఘునంద్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో (Telangana BJP) కొనసాగుతున్నారు.

Also Read: KCR – Third Place : కామారెడ్డిలో మూడోస్థానంలో కేసీఆర్.. ముందంజలో రేవంత్

  Last Updated: 03 Dec 2023, 11:05 AM IST