Munugode: మునుగోడుపై బీజేపీ హైరానా

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. అధికార తెరాస దెబ్బకు గులాబీ వాడినట్టు బీజేపీ వాలకాన్ని గమనిస్తే తెలుస్తుంది.

  • Written By:
  • Updated On - October 29, 2022 / 12:17 PM IST

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. అధికార తెరాస దెబ్బకు గులాబీ వాడినట్టు బీజేపీ వాలకాన్ని గమనిస్తే తెలుస్తుంది. హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పిలిపించినట్టు సమాచారం. అంతే కాదు ఈ నెల 31 న మునుగుడు కేంద్రంగా జరగాల్సిన బహిరంగ సభ రద్దు అనుమానాలకు తావిస్తుంది. నాలుగు ఎమ్యెల్యేను కొనుగోలు చేసే విషయంలో బీజేపీ అడ్డంగా దొరికిందని టీఆర్ ఎస్ చెబుతుంది. ఆ ప్రభావం మునుగోడు మీద పడిందని బీజేపీ వర్గాల్లోని సందేహం.

తొలుత దూకుడుగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి పోలింగ్ దగ్గర పడే సమయానికి డీలా పడినట్టు కనిపిస్తుంది. ఇటీవల జ్వరంతో ప్రచారానికి రాలేకపోతన్నా అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దీంతో ఆయన ఓటమి తప్పదని ప్రత్యర్థులు ప్రచారం ఊపందుకుంది. సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు వచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి మహిళా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ చుసిన తరువాత బీజేపీ ఒక్క సారిగా డైలమాలో పడిందని ఆ పార్టీ వర్గాల్లోని చర్చ తొలి నుంచి రాజగోపాల్ 18 వేల కోట్లకు అమ్ముడు పోయాడని ప్రచారం జరిగింది. దాన్ని బలంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బలంగా తీసుకెళ్లాడు. అదే ప్రచారాన్ని టీ ఆర్ ఎస్ కూడా అందుకుంది. మంత్రి కె టీ ఆర్ ప్రధానంగా రాజగోపాల్ కాంట్రాక్టు గురించి బలంగా తీసు కెళ్ళారు. లోకల్ ప్రభుత్వ సెంటిమెంట్ ను వినిపించారు. ఇంకో వైపు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రభావం కూడా బీజేపీ మీద పడింది. ఆయన కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కి ప్రచారం చేయడం రాజగోపాల్ రెడ్డి కి మైనస్ అయిందని ప్రచారం ఉంది.

Also Read:   TRS: ఎమ్మెల్యేల కొనుగోలు ఉత్తుతిదేనా… ఇదంతా కేసీఆర్ వ్యూహమా?… టీఆర్ఎస్ మౌనం వెనక కారణమేంటీ..!!

తెలంగాణ బీజేపీ విభాగాన్ని అధిష్టానం మందలించినటు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలపై స్తానిక సంస్థల ఇంచార్జ్ సునీల్ మీటింగ్ పెట్టాడని తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నలుగురు ఎమ్యెల్యేల కొనుగోలు అంశంపై మీడియాలో స్పందించిన తీరు ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఇవన్నీ గమనిస్తే బీజేపీ కి మునుగోడు ఆశలు సన్నగిల్లి నట్టు కనిపిస్తుంది.