BJP : తెలంగాణ బీజేపీ ఎందుకు సైలెంట్ అయ్యింది ? కారణం అదేనా ?

తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

  • Written By:
  • Publish Date - July 20, 2024 / 08:07 AM IST

BJP : తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ గ్రాఫ్ మునుపెన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయింది. ఇంత సానుకూల పరిస్థితులు ఉన్నా.. తెలంగాణ బీజేపీ ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లో ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ.. అటు బీఆర్ఎస్‌పై కానీ బీజేపీ కీలక నేతలు విమర్శలు చేస్తున్న దాఖలాలు చాలావరకు తగ్గిపోయాయి. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం చాలా యాక్టివ్‌గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేతలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల టైంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించిన తెలంగాణ బీజేపీ.. ఇప్పుడు అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో బీజేపీ(BJP) కీలక నేతల మౌనం ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బిజీగా ఉంటున్నారు. ఆయన వీకెండ్స్‌లో తెలంగాణకు రావడం కూడా కష్టమే. దీంతో తెలంగాణ బీజేపీలో ఎవరు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలో అర్థం కాక సైలెంట్ అయ్యారని పరిశీలకులు చెబుతున్నారు. మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. దీంతో ఆయన కూడా బిజీ  అయ్యారు.  ఈవిధంగా తెలంగాణ బీజేపీకి చెందిన రెండు పెద్దగొంతుకలు రాష్ట్రానికి దూరంగా ఢిల్లీలో ఉంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తేనే ఈ లోటు భర్తీ అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read :Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు

బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి‌లకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చినందున ఎవరైనా సీనియర్ నేతకు రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవిని కేటాయించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ రేసులో ఈటల రాజేందర్(Etela Rajender) ముందు వరుసలో ఉన్నారని సమాచారం. అయితే దీనిపై బీజేపీలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే ఈటలను వ్యతిరేకిస్తున్నారు. ‘‘కొంత మంది నేతలు సైలెంట్ గా వేరే పార్టీల నుంచి వచ్చారు. అలాంటి కొత్త వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దు’’ అని ఆయన ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఇటీవల కేంద్ర పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులు రాజాసింగ్ వాదనతో విభేదించాారు. పార్టీలో ఉన్న వారిలో కొత్త పాత అంటూ ఏమీ ఉండదని ఆయనకు తేల్చి చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాల కారణంగా వెంటనే రాష్ట్ర బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడిని నియమించే అవకాశం లేదని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 35 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు పదహారు శాతం ఓట్లు వచ్చాయి.

Follow us