Telangana BJP :`బండి`ప‌ద‌వికి మూడింది.?ఆప‌రేష‌న్ `షా`

ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజ‌కీయాల‌పై(Telangana BJP) దృష్టి పెట్టింది.

  • Written By:
  • Updated On - April 14, 2023 / 01:40 PM IST

ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజ‌కీయాల‌పై(Telangana BJP) దృష్టి పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వ‌చ్చే లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డింది. రెండు రోజుల క్రితం స‌స్పండ్ అయిన పొంగులేటి శ్రీనివాసుల‌రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి క్రిష్ణారావుకు(ponuguleti, jupalli) వ‌ల వేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌ల్ల కాద‌ని తెలుసుకున్న ఢిల్లీ పెద్ద‌లు రంగంలోకి దిగారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన ఏలేటి మ‌హీశ్వ‌ర‌రెడ్డిని బీజేపీ ఆకర్షించింది. ఇదంతా సంజ‌య్ ప్ర‌మేయం లేకుండా జ‌రిగిన ఆప‌రేష‌న్ గా అధిష్టానం గుర్తించింది.

ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజ‌కీయాల‌పై(Telangana BJP)

తెలంగాణ బీజేపీ చీఫ్ (Telangana BJP) బండి సంజ‌య్ మీద చాలా మంది సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ్రూప్ న‌డుస్తోంది. క‌రీంన‌గ‌ర్ కు చెందిన కొంద‌రు ఢిల్లీ వెళ్లి బండి మీద ఫిర్యాదు కూడా చేశారు. కానీ, ఇటీవ‌ల ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌లు హిట్ కావ‌డంతో అధిష్టానం ఆశీస్సుల‌ను సంపాదించారు. అయిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియ‌ర్లు బండి మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆయ‌న ఏక‌ప‌క్ష ధోర‌ణి మీద అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. అందుకే, ఆయ‌న‌కు రెండోసారి అధ్య‌క్ష ప‌ద‌విని కొన‌సాగిస్తూ ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఎన్నిక‌ల‌కు మాత్రం ఆయ‌న సార‌థ్యంలోనే వెళతామ‌ని బీజేపీ అధిష్టానం ప్ర‌క‌టించింది.

బండి సంజ‌య్ మీద చాలా మంది సీనియ‌ర్లు గుర్రు

తెలంగాణలో బీజేపీ బ‌లంగా ఉన్న‌ట్టు ఫోక‌స్ చేసింది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆ పార్టీకి అంత సీన్ లేదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ఢిల్లీ పెద్ద‌లు ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను తీసుకోవాల‌ని రాష్ట్ర‌శాఖ‌ను ఆదేశించింది. చేరిక‌ల క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. దానికి కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఈటెల‌ను స‌భ్యులుగా చేర్పించింది. ఆ దూకుడును చూసిన ప్ర‌త్య‌ర్థులు కొంత అల‌జ‌డి చెందారు. కానీ, ఇత‌ర పార్టీల నుంచి పెద్ద‌గా ఎవ‌రూ బీజేపీలోకి వెళ్ల‌లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాసోజు శ్రావ‌ణ్ లాంటి వాళ్లు వెళ్లారు. వారం తిర‌గ‌కుండా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ ప‌రిణామాన్ని చూసిన త‌రువాత ఎవ‌రూ ఇత‌ర పార్టీల లీడ‌ర్లు త్వ‌ర‌ప‌డి బీజేపీలోకి వెళ్ల‌డంలేదు.

మాజీ మంత్రి ఈటెల‌కు ఫుల్ ప‌వ‌ర్స్

బీఆర్ఎస్ బ‌హిష్క‌రించిన లీడ‌ర్లు పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి, జూప‌ల్లిని(ponguleti, jupalli) కూడా బీజేపీ ఆక‌ర్షించేందుకు క‌ష్ట‌ప‌డుతోంది. దానికి కార‌ణం తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్యక్షుడు బండి సంజ‌య్ వాల‌క‌మంటూ ఆ పార్టీలోని ఒక వ‌ర్గం భావిస్తోంది. అందుకే, ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. మాజీ మంత్రి ఈటెల‌కు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చారు. ఆయ‌న చేసిన ఆప‌రేష‌న్ మ‌హేశ్వ‌ర‌రెడ్డి విష‌యంలో స‌క్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల ఇంచార్జిగా ఏలేటి ఉన్నారు. ఆయ‌న ఆదిలాబాద్ జిల్లాలో బ‌ల‌మైన లీడ‌ర్‌. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్ష పోక‌డ‌ల దెబ్బ‌కు ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని భావిస్తూ షోకాజ్ నోటీస్ పీసీసీ ఇచ్చింది. దీంతో ఆయ‌న నేరుగా ఈటెల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు.

Also Read : Telangana Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీ గూటికి ఏలేటి!

ఇక ఇప్పుడు పొంగులేటి, జూప‌ల్లి (ponguleti, jupalli )మీద బీజేపీ ఆప‌రేష‌న్ కొనసాగిస్తోంది. ఆ ఇద్ద‌రు చేర‌డానికి ఇష్టంగా ఉన్న‌ప్ప‌టికీ బండి వాల‌కం మీద అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఈటెల కొంత మేర‌కు పొంగులేటి చేరిక మీద ఆప‌రేష‌న్ చేశారు. ఆయ‌న కుమార్తె వివాహానికి బీజేపీ నేత‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అప్పుడే అంద‌రూ బీజేపీలోకి పొంగులేటి అంటూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఆయ‌న ఆచితూచి అడుగులు వేస్తూ బీజేపీలోని సీనియ‌ర్ల ప‌రిణామాల‌ను బేరీజు వేసుకున్నారు. ఆ లోపుగా తెలంగాణ రైతు స‌మితి(టీఆర్ఎస్) పార్టీని రిజిస్ట్ర‌ర్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. అందుకు బాధ్యులుగా జూప‌ల్లి, పొంగులేటిని భావిస్తూ బీఆర్ఎస్ వేటు వేసింది. ఇప్పుడు వాళ్లిద్ద‌రి ప‌య‌నం బీజేపీ వైపా? కొత్త పార్టీ టీఆర్ఎస్ నుంచి ప‌నిచేస్తారా? అనేది సందిగ్ధం. అయితే, తాజాగా బీజేపీ చేస్తోన్న ఆప‌రేష‌న్ తీవ‌త్ర‌ను గ‌మ‌నిస్తే బీజేపీలోకి వెళ‌తార‌ని తెలుస్తోంది.

 

Also Read : Telangan BJP: బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్