Site icon HashtagU Telugu

BJP Last List : చివరి రోజు.. 14 మంది అభ్యర్థులతో బీజేపీ చివరి జాబితా

BJP

Bjp Another 6

BJP Last List : ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈ టైంలో బీజేపీ 14 మందితో చివరి జాబితాను రిలీజ్ చేసింది. వెంటనే ఆయా అభ్యర్థులకు బీఫామ్‌లు అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేనతో సీట్ల సర్దుబాటు కారణంగా ఇంత ఆలస్యంగా చివరి జాబితా విడుదల అయిందని సమాచారం. ఈసారి అసెంబ్లీ పోల్స్‌లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగానూ జనసేనకు బీజేపీ 8 సీట్లను కేటాయించింది. మిగతా 111 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది.మొత్తం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోలిస్తే.. అభ్యర్థుల ప్రకటన, ప్రచారం అన్నింట్లోనూ బీజేపీ వెనుకబడే ఉంది. ప్రత్యేకించి బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఇలా జరిగిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  ఓవరాల్‌గా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను చూస్తే.. బీఆర్ఎస్‌కు పోటీనిచ్చే బలమైన పార్టీగా కాంగ్రెస్‌ నిలిచింది. బలమైన అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌లోనే ఎక్కువగా(BJP Last List) కనిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • బెల్లంపల్లి  – కొయ్యల ఏమాజీ
  • పెద్దపల్లి  – దుగ్యాల ప్రదీప్
  • సంగారెడ్డి – దేశ్‌పాండే రాజేశ్వర్ రావు
  • మేడ్చల్ – ఏనుగు సుదర్శన్ రెడ్డి
  • మల్కాజిగిరి – ఎన్.రామచందర్ రావు
  • శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
  • నాంపల్లి – రాహుల్ చంద్ర
  • చాంద్రాయణగుట్ట – కే.మహేందర్
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ – గణేశ్ నారాయణ్
  • దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి
  • వనపర్తి – అనుగ్నా రెడ్డి
  • ఆలంపూర్ – మేరమ్మ
  • నర్సంపేట – పుల్లారావు
  • మధిర – పేరుమార్పల్లి విజయరాజు

Also Read: Leave Alone – Signs : ‘నన్ను వదిలెయ్’.. మీ భాగస్వామి ఇచ్చే 8 సంకేతాలివీ..