Site icon HashtagU Telugu

BJP Election Campaign : బీఆర్ఎస్ అంటే ‘భ్రష్ట చారి రాక్షసుల సమితి’ – జెపి నడ్డా

Jp Nadda

Jp Nadda

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాషాయం (BJP) జెండా ఎగురవేయాలని కసి మీద ఉన్న బిజెపి..ఎన్నికల ప్రచారంలో తమ దూకుడు కనపరుస్తున్నారు. ప్రచారానికి (Telangana Election Campaign) మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం తో ప్రధాని మోడీ దగ్గరి నుండి కేంద్ర మంత్రులంతా తెలంగాణ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ప్రతి ఒక్కరు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ..బిఆర్ఎస్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థి చల్ల శ్రీలత విజయాన్ని ఆకాంక్షిస్తూ బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభకు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ అంటే భ్రష్ట చారి రాక్షసుల సమితి అని అభివర్ణించారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్ఢ్ భూములను ధరణి పోర్టల్ లో తీసుకురాకుండా వేలాదిమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి , పెద్దలకు డబ్బులు దాచుకునేందుకు ఒక మిషన్ లాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఎన్నో నిధులు కేటాయించిందని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు మాత్రమే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందని నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ను దానిని 16% పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఒకే మతానికి చెందిన వారికి ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు.

మహిళలు ఆత్మగౌరవంగ జీవించాలన్న, అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి కల్పించాలన్న, రైతులకు మేలు చేయాలన్న అది బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు అధికారంలో ఉండి వేలాదిమంది యువకులను బలి తీసుకోవడానికి కారణమైందని దుయ్యబట్టారు.

Read Also : AP Elections 2024 : మార్చి 06 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..?