Telangana: తెలంగాణలో పలు జిల్లాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా భాస్కర్, అలాగే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా దినేశ్ ని నియమించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 12 జిల్లాల్లో బీజేపీ తమ అధ్యక్షుల్ని మార్చింది.
కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు:
* నిజామాబాద్ – దినేష్ కుమార్
* పెద్దపల్లి – చందుపట్ల సునీల్
* సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట – మోహన్ రెడ్డి
* యాదాద్రి – పాశం భాస్కర్
* వనపర్తి – డి నారాయణ
* వికారాబాద్ – మాధవరెడ్డి
* నల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు – బలరాం
* మహబూబ్ నగర్ – పీ శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ – గంట రవి
* నారాయణపేట – జలంధర్ రెడ్డి
కొత్తగా నియమితులైన 6 మోర్చాలా అధ్యక్షులు:
* ఎస్టీ మోర్చా – కల్యాణ్ నాయక్
* ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
* యువ మొర్చా – మహేందర్
* OBC మోర్చా – ఆనంద్ గౌడ్
* మహిళ మోర్చా – డాక్టర్ శిల్పా
* కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా