Site icon HashtagU Telugu

BJP Bans KCR Media: కేసీఆర్ మీడియాపై ‘బీజేపీ’ నిషేధం

Tbjp

Tbjp

తెలంగాణలో రాజకీయాలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ ఫైట్ కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అనుకూల మీడియా సంస్థలపై తెలంగాణ బీజేపీ నిషేధం విధించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్మల మీడియాతో మాట్లాడారు. అయితే కొన్ని మీడియా సంస్థలకు షాక్ తగిలింది. టి న్యూస్, తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ మీడియా మీట్ నుండి తప్పుకోవాలని సున్నితంగా కోరినట్టు తెలుస్తోంది.

ఆ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులను మీడియా మీట్ నుంచి బయటకు వెళ్లాలని బీజేపీ నాయకులు కోరారట. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మూడు మీడియా సంస్థలను బీజేపీ స్పష్టంగా నిషేధించింది. ఇటీవల నిర్మల సీతరామన్ రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటోలు లేవని కలెక్టర్‌ని ప్రశ్నించారు. ఈ విషయమై టీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. అయితే విచిత్ర ఏమిటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో TV9, NTVలను బహిష్కరించాలని తన పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. తాజాగా తెలంగాణలో బీజేపీ కూడా బ్యాన్ చేయడం గమనించదగ్గ విషయం. అయితే కేవలం కేంద్ర మంత్రి నిర్మల పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత కూడా నిషేధం కొనసాగిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే!

Exit mobile version