Telangana Bandh : రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు..!

నిరుద్యోగ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్న రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 03:43 PM IST

తెలంగాణ లో మళ్లీ బంద్ (Telangana Bandh) ల పిలుపులు మొదలయ్యాయి. నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. గత ప్రభుత్వం ఏవిధంగా మోసం చేసిందో..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి పాటిస్తోందటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తమ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు. జాబ్ క్యాలెండ‌ర్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ గాంధీ ఆస్ప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్నారు. అయితే మోతీలాల్ నాయ‌క్‌ను ప‌రామ‌ర్శించేందుకు గాంధీ హాస్పిట‌ల్‌కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బ‌క్క జ‌డ్స‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నిరుద్యోగ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్న రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఎక్క‌డ దాక్కున్నాడ‌ని నిల‌దీశారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? అని బ‌క్క జ‌డ్స‌న్ తీవ్ర ఆగ్ర‌హం వెలిబుచ్చారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల మీద పోరాటంలో భాగంగా మంగ‌ళ‌వారం తెలంగాణ బంద్‌కు బ‌క్క జ‌డ్స‌న్ పిలుపునిచ్చారు. నిరుద్యోగులంతా ఏక‌మైన ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.

అలాగే ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే చెప్పే విధంగా లేని బూతులు తిడుతున్నారు. ఫ్రీ పధకాలు ఎవడు ఇవ్వమన్నాడని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీ లేనప్పుడు మీముప్రయాణం చేయలేదా అని అంటున్నారు. ఇదే సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ కు ఓ సూచనా తెలియజేసింది.

Read Also : Andhra: ఆంధ్ర ను చూసి ఈర్ష పడే రోజులు రాబోతున్నాయా..?