Site icon HashtagU Telugu

VRAs Protest: అసెంబ్లీ ముట్టడి.. వీఆర్ఏలపై విరిగిన లాఠీ!

Vra

Vra

తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను వీఆర్ఏలు ముట్టడించి ఆందోళనలను మరింత ఉద్రిక్తం చేశారు. తమ నిరసనలో భాగంగా మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన గ్రామ రెవెన్యూ సహాయకులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గత వారం రోజులుగా వివిధ డిమాండ్లపై నిరసనలు చేస్తున్నారు. ఇప్పటివరకు 20మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత రెండురోజుల వ్యవధిలో ఇద్దరు వీఆర్ఏలు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా హైదరాబాద్‌లో వీఆర్ఏలు చేపట్టిన అసెంబ్లీ ముట్టిడి కూడా నిఘావర్గాల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మరోపక్క వేలాది మంది వీఆర్ఏలు ముట్టడికి రావడం కలకలం రేపింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు నిలువరించలేక అవస్థలు పడ్డారు. పరిస్థితి అదుపుతప్పే సమయంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి వీఆర్ఏలను చర్చలకు పిలవడంతో కాస్త సద్దుమణిగింది. కేటీఆర్ హామీ వీఆర్ఏలు ఆందోళనను తాత్కాలికంగా విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వీఆర్ఏలు ధర్నాచౌక్ ను విడుతున్నారు.

https://twitter.com/KP_Aashish/status/1569590019979104257