Site icon HashtagU Telugu

Telangana Assembly Session : వాడివేడిగా నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Session

Telangana Assembly Session

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిన్న గవర్నర్ మాట్లాడుతూ..గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగం ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

“గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవి” అని మండిపడ్డారు. పదేళ్ల పాలనపై మాట్లాడమంటే మళ్ళీ గతం గురించి ప్రస్తావించడమేంటని మంత్రి పొన్నం…. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదని విమర్శలు చేశారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు జరిగాయన్నారు. కొడంగల్ నుంచి బొంబాయికు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో.. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవన్నారు. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలి.. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలని చురకలు అంటించారు కేటీఆర్. కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు

శాస‌న‌స‌భ ప్రారంభ‌మైన తొలి రోజు కొత్త స‌భ్యులు, ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. రెండో రోజు స్పీక‌ర్ ఎన్నిక జ‌రిగింది. ఇక మూడో రోజైన నిన్న‌.. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించారు. ఈరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై చ‌ర్చ నడుస్తుంది.

Read Also :