Site icon HashtagU Telugu

Telangana Assembly : రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana assembly meetings from tomorrow

Telangana assembly

Telangana Assembly Session 2024: రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే గవర్నర్‌ 23 నుండి శాసనసభ, 24 నుండి మండలి సమావేశాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలిరోజున కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ సంతాపం తెలపనుంది. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. బడ్జెట్‌తోపాటు, ధరణి, రైతు భరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్‌ క్యాలెండర్‌, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారినుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక.. కేంద్రం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్‌లు, ఇతర నిధుల్ని పరిశీలించి తెలంగాణ బడ్జెట్‌కు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌.. సమావేశం నిర్వహించి బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది. నాలుగు నెలల కోసం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన 2 లక్షల 75 వేల కోట్ల ఓటాన్ బడ్జెట్‌ ఈ నెలాఖరుతో ముగియనుంది.

Read Also: Puri Jagannath Vs Raviteja : పూరీ వర్సెస్ రవితేజ.. ఫైట్ లో గెలిచేది ఎవరు..?

మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీస్‌ శాక పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగేటప్పుడు వివిధ వర్గాలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో గన్​పార్క్‌ వద్ద, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సివిల్‌ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించేది లేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాస్‌లు ఉన్నా కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు.

Read Also: Dangerous Selfies: భారీ వర్షాలు కురుస్తున్నాయి, జర సెల్ఫీలు మానుకోండి