Site icon HashtagU Telugu

TS Assembly Meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Ts Assm

Ts Assm

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings ) రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ (TS Assembly Speaker Gaddam Prasad Kumar) ప్రమాణ స్వీకారం చేసారు. అలాగే పలువురు ఎమ్మెల్యేల లు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసింది.

శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్‌గా నియామకమైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్‌తో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో కేబినెట్‌ సమావేశం కూడా ప్రారంభం కానుంది. గవర్నర్‌ ప్రసంగం, శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రంపై చర్చించనుంది. ఇదిలా ఉంటె మంత్రులుగా పది రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన పలువురు లాంఛనంగా ఆయా మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లలో ప్రవేశించి కీలకమై పైళ్ళపై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎం (ఫైనాన్స్, ఎనర్జీ) మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరులంతా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Read Also : Covid-19 Cases: ఈ దేశాలలో మరోసారి కరోనా కలకలం.. మార్గదర్శకాలు జారీ..!