Site icon HashtagU Telugu

Telangana : డిసెంబర్ 07 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

Telangana Assembly Election 2023

Telangana Assembly Election 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections 2023 ) మరో రెండు నెలల సమయం మాత్రమే ఉందా..అంటే అవుననే చెప్పాలి. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఎన్నికల తేదీలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఆ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 7న (December 07) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ (December 11 Counting) నిర్వహించి… ఎన్నికల ఫలితాలు (Telangana Assembly Election Results ) ప్రకటిస్తారు. ఇది తాత్కాలిక షెడ్యూలు మాత్రమే. అయినా… కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి 19న నామినేసన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉససంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ 22న అభ్యర్థుల తుది జాబితా (ఫారం-7ఏ) ప్రకటించనున్నారు. 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్ సైతం ఇదే కావడం విశేషం. ఇక డిసెంబర్ నెలలో ఎన్నికలను నిర్వహించాలంటే… ఎన్నికల కమిషన్‌ ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈసీ ఆ పనిలోనే బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాడ్‌ తనిఖీలు కూడా పూర్తిచేశారట.

ఇక ఒకదాని తర్వాత మరొకటి… వరుసగా ఎన్నికల పనులు జరిగిపోతాయని చెప్తున్నారు. అక్టోబర్‌లో ఎన్నికల సామాగ్రి సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన, రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారుల శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారు. ఈ పనులన్నీ అక్టోబర్‌లోపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే… నవంబర్‌లో పోలీసు సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల ప్రకటన, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల నియామకం, బ్యాలెట్ పరిశీలకులకు శిక్షణ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.