CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఎదురైన అడ్డంకులు తెలంగాణలో రాకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపితే అది పెండింగ్‌లో పడిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే చట్టం తీసుకొచ్చిందని, ప్రస్తుతం బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైరల్!
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు అడ్డంకిగా మారాయని, ఈ సమస్యను తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై గంగుల కమలాకర్ ఒక్కరే సంతోషంగా ఉన్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం దుఃఖంతో ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే బీఆర్‌ఎస్ మద్దతు తెలపలేదని, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘మేము సహకరించం, మా బుద్ధి మారదు’ అంటే ప్రజలే సమాధానం చెబుతారని సీఎం హెచ్చరించారు. బీఆర్‌ఎస్ తమకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదని, ముందు వారి నాయకుడు కేసీఆర్‌ను సభకు రమ్మనమని ఆయన అన్నారు. కేసీఆర్ సభకు రాడు, వచ్చినవారు ఇలా ఉన్నారని, ‘కల్వకుంట్ల’ కాదు ‘కలవకుండా చేసే కుటుంబం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని చులకన కావద్దని, పొన్నం ప్రభాకర్‌ను అవమానిస్తే ఏమీ రాదని, అలా మాట్లాడితే మీరే చులకన అవుతారని ఆయన బీఆర్‌ఎస్ సభ్యులకు సూచించారు.
Sudarshan Chakra : ‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది – రాజ్‌నాథ్ సింగ్