Site icon HashtagU Telugu

Telangana Budget Sessions 2024 : ముగిసిన బడ్జెట్ ప్రసంగం..సోమవారానికి వాయిదా

Telangana Assembly Adjourne

Telangana Assembly Adjourne

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా ప్రసంగించి బడ్జెట్ ను ముగించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేశారు.

బడ్జెట్ హైలైట్స్ (Telangana Budget 2024 Highlights ) చూస్తే..

ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు :

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు భట్టి పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మాత్ర‌మే చేయ‌డం జ‌రిగింద‌న్నారు. హామీల‌కు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించే ప‌ని ఇంకా కొన‌సాగుతున్నందున‌, అది పూర్త‌యిన వెంట‌నే అమ‌లుకు అవ‌స‌ర‌మైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్ర‌మార్క తెలిపారు.

గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ. 2,418 కోట్లు కేటాయింపు :

రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల‌కు గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించ‌బోతున్నామ‌ని ఆర్థిక భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ నిర్ణ‌యం జ‌రిగింద‌న్నారు. దాని అమ‌లుకు కావాల్సిన స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు బ‌డ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు భ‌ట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు.

రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ :

రైతుల రుణ‌మాఫీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు భట్టి. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రూ. 2 లక్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అందుకు విధివిధానాల‌ను రూపొందిస్తున్నాం. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌న్నారు.

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు : 

Read Also : EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. వ‌డ్డీ రేటు పెంపు..!